No Copy

Thursday, September 20, 2018

In India all are equal.

In India, all are equal.

In India, all are equal,
but I vote for my caste people.
In India, all are equal,
but I am fan of my caste hero.
In India, all are equal,
but I choose to stand by my caste people.
In India, all are equal,
but I give priority to orange clothes.
In India, all are equal,
but I ask which church you go on Sunday.
In India, all are equal,
but I hate inter-caste marriages.
In India, all are equal,
but I give priority to one animal.
In India, all are equal,
but I will not allow you walk through my roads.
In India, all are equal,
but I want to know which part of India you belongs to.
In India, all are equal,
but I will not allow you in temples.
In India, all are equal,
but I will not allow my daughters education.

In India, we all are equal.

Wednesday, September 19, 2018

ఇంటర్వ్యూ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?


ఇంటర్వ్యూ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవటానికి తెలుసుకోవాలిసిన పద్దతులు.
మనము ఏ ప్రొఫెషన్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళలిసి వచ్చిన మనము ప్రిపేర్ అయివుండాలి.
మొదటిగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి.ఎందుకంటే మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ లో 90 + వచ్చిన, మీ దెగ్గర మంచి టాలెంట్ వున్నా, అదీ ప్రెసెంట్ చేయలేకపోతే ఇంటర్వ్యూయర్ కి మనము రీచ్ ఆవము. మనము ఇంటర్వ్యూ లో సక్సెస్ ఆవలి అంటే మనము చక్కగా అడిగానా క్యూస్షన్ కి మనము విడమర్చి చెప్పగలగాలి. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మాత్రమే కాదు... వెర్బల్ అండ్ non వెర్బల్ కూడా ముఖ్యమే.

కంపెనీ గురుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాలి?
మనమే ఏ కంపెనీ కి అయితే ఇంటర్వ్యూ కి వెళ్తున్నామో... ఆ కంపెనీ గురుంచి ఇంటర్నెట్ లో పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ముఖ్యమైన సమాచారం అంటే....కంపెనీ కి ఏ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. కంపెనీ CMM లెవెల్ఏంటో తెలుసుకోవాలి అంటే లెవెల్ - 3 లేక లెవెల్ - 5 తెలుసుకోవాలి. మీరు సెలెక్ట్ అయితే ఏ సర్వీస్ లేక ప్రోడక్ట్ లో పనిచేస్తారో తెలుసుకోగలగాలి. కంపెనీ గురుంచి గూగుల్ లో కానీ ఇంకా వేరే సెర్చ్ ఇంజిన్స్ లో రివ్యూస్ చూడాలి. ఈ పైన చెప్పిన సమాచారంతో మనకు కంపెనీ గురుంచి అవగాహన కలిగి వుండాలి.

జాబ్ Description (JD ) గురుంచి పూర్తిగా తెలుసుకోవాలి.
ఏ రోల్ అప్లై చేస్తున్నారో తెలుసుకోవాలి , Responsibilities కూడా అన్ని తెలుసుకోవాలి. Ex - ప్రోడక్ట్ developers, ప్రోడక్ట్ టెస్టర్స్,  ప్రొడక్షన్ సపోర్ట్ ఈలా వేరు వేరు రోల్స్ వున్నాయి అనుకో. Responsibilities అంటే ఆ రోల్ లో మనము ఏమి చేయాలి. ఏమి చేయకోదాడదు. అన్ని ఉంటాయి. Usual గ ఏమి చేయాలో ఉంటాయి. దాన్నిబట్టి ఏమి చేయకూడదో అర్ధం చేసుకోవొచ్చు. జాబ్ లో జాయిన్ అయినాక (TOR అంటే Terms of Reference ) ఇస్తే అందులో ఇంకా క్లియర్ చూసుకోవొచ్చు. ఇప్పుడు మనము ఫ్రెషర్ అనుకో ప్రాబ్లెమ్ లేదు ఈ రోల్ అయినా మనకి పర్వాలేదు. కానీ. 2 yrs ఎక్స్పీరియన్స్ డెవలపర్ గ వుంది అనుకో. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కి వచ్చినాక సపోర్ట్ మీద వర్క్ చేయాలి అంటే... కొద్దిగా కష్టం గ ఉంటుంది. సో సపోర్ట్ కి సంబంధించి ఎక్కువ ఇంటర్వ్యూ క్యూస్షన్స్ ఉంటాయి. సో JD తప్పకుండ చూసుకోవటం మంచిది.

FAQs చదువుకుంటే మంచిది .
FAQs (Frequently Asked Questions) తప్పకుండ చూసుకోవాలి. మనకి పూర్తి సబ్జెక్టు మీద అవగాహనా వున్నా కూడా.. FAQs చూసుకుంటే మనము బాగా ప్రిపేర్ అయి కాంఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. చాల మంది ఇంటర్వ్యూయర్స్ ఎక్కువుగా FAQs లో నుంచి క్యూస్షన్స్ అడుగుతూ వుంటారు. FAQs చూసేటప్పుడు క్యూస్షన్స్ మాత్రమే చూడాలి, ఎందుకంటే ఆన్సర్స్ 50 % తప్పుగా కూడా ఉండొచ్చు. అందులో మనము క్యూస్షన్ కి మాత్రమే ఆన్సర్ చదవకుండా... ఆ క్యూస్షన్ తో వున్నా సబ్జెక్టు పార్ట్ మొత్తం చదువుకుంటే మనకి ఇంటర్వ్యూ క్లియర్ అవటానికి ఉపయోగపడుతుంది.

ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ.
జనరల్ గ అంటే వాళ్ళ అకాడమిక్ సబ్జక్ట్స్ లో క్యూస్షన్స్ అడుగుతారు... తరువాత అకాడమిక్ ఇయర్ లో చేసిన ప్రాజెక్ట్స్ గురుంచి అడుగుతారు... సో ప్రాజెక్ట్స్ గురుంచి ఎక్కువగా అవగాహనా కలిగి ఉండాలి. అవి మనమే చేస్తే తప్పకుండ అవగాహనా ఉంటుంది... లేక వేరే వాళ్ళతో ప్రాజెక్ట్ చేస్తే మనకు అంత అవగాహనా వుండకపోవొచ్చు. సో ఎవరు చేసిన ఆ ప్రాజెక్ట్స్ మన రెస్యూమ్ లో తప్పకుండ ఉంటుంది కాబట్టి మనకు ఆ ప్రాజెక్ట్ గురుంచి మనకి ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్ లో మన కాంట్రిబ్యూషన్ గురుంచి ఎక్కువుగా క్యూస్షన్స్ ఉంటాయి, సో బాగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇంటర్వ్యూయర్ ఫ్రెషర్స్ కాంఫిడెన్స్ కూడా చూస్తారు. ఒకసారి నేను ఫ్రెషర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు (మార్కెటింగ్ జాబ్ ) అతను చాల కాన్ఫిడెంట్ గ ఉన్నట్లు వున్నాడు. ఒక స్టోన్ ఇచ్చి చూడండి అదీ అమ్మి వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఓవర్ కాంఫిడెన్స్ గ కనిపించింది. సో కాన్ఫిడెంట్ మంచిది కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మనకు అంత మంచిది కాదు.
ఎక్సపీరియన్స్డ్ ఇంటర్వూస్
ఎక్సపీరియెన్స్డ్ అంటే మనకి ఇంటర్వూస్ లో కూడా బాగానే ఎక్సపీరియన్సు ఉంటుంది కాబట్టి అంత చెప్పాలిసిన అవసరం ఉండదు. ఒక వేళా మనము ఫేక్ఎక్స్పీరియన్స్ పెడుతుంటే తప్పకుండ తెలుసుకోవాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టమని నా ఉదేశం కాదు... కానీ పెడితే తెలుసుకోవాలిసిన జాగ్రత్తలు గురుంచి మనము తెలుసుకుందాము. మనము రెస్యూమ్ లో పెట్టిన ప్రతి విషయం గురుంచి మనకు అవగాహనా కలిగి ఉండాలి. అందులో పొందిపరిచిన ప్రాజెక్ట్స్ గురుంచి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏ software , languages లేక systems ఉపయోగించారో తెలుసుకోవాలి. డాక్యుమెంటేషన్ గురుంచి తెలుసుకోవాలి. ఫ్లో అఫ్ వర్క్ (Flow of Work ) గురుంచి తెలుసుకోవాలి. వెర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ గురుంచి తెలుసుకోవాలి. 2 ఇయర్స్ లేక 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు అంత అవగాహనా కలిగి ఉండాలి...

క్యూస్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ లాస్ట్ లో జనరల్ గ Any Questions ? అని అడుగుతారు.... సో ఏమి లేవు అని చెప్పకుండా. ఏమి అడగాలో మనము ముందుగా ప్రిపేర్ అయి ఉంటే మనకే మంచిది. నన్ను సెలెక్ట్ చేసారా లేక ఒకేఒక ఛాన్స్ ఇవ్వండి :) ఎలా కాకుండా... స్పోర్ట్స్ లేక గేమ్స్ ఆడటానికి గేమ్స్ రూమ్ లాగా ఫెసిలిటీ వుందా. కంపెనీ లో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది?కెరీర్ పాత్ (Career Path ) ఎలా ఉంటుంది. ఎలా క్యూస్షన్స్ అడిగితే బాగుంటుంది.

Write ఇంటర్వ్యూ క్యూస్షన్స్.
ఇంటర్వ్యూ కి వెళ్లిన ప్రతిసారి, మనము ఇంటర్వ్యూయర్ అడిగిన క్యూస్షన్స్ గుర్తుపెట్టుకొని అవి మన నోట్స్ లో రాసుకోవాలి. అన్ని క్యూస్షన్స్ రాసుకున్నాక... నీకు నువ్వు సెల్ఫ్ ఎవాల్యూట (సెల్ఫ్ review ) చేసుకోవాలి. అప్పుడు మన strengths అండ్ Weaknesses గురుంచి తెలుసుకొని. మన weaknesses ని strength గ మార్చుకోవాలి.

సో గుడ్ లక్.
-Mike SAMS

Wednesday, September 12, 2018

ఉద్యోగం కోసం ప్రొఫెషనల్ రెస్యూమ్ కావాలా ?

జాబ్ కోసం ప్రొఫెషనల్ resume కావాలా ?

మొదటిగా అసలు resume ఎందుకు కావాలి?
రెస్యూమ్ యొక్క అవసరము మనకి తెలియాలి అవునా కదా ?
రోజు మనము పేపర్లో , జాబ్ వెబ్ సైట్స్ లో , టీవిలో ఉద్యోగ ప్రకటనలు చాలా చూస్తూవుంటాము.
అందులో వున్నా అన్ని జాబ్స్ కి మనకు అర్హత ఉండదు , కొన్ని ఉంటాయి, కొన్ని వుండవు...
అర్హత వున్నా  లేకున్నా మనము అవసరము రీత్యా అప్లై చేస్తువుంటాము . మరి ఆ వైపు కంపెనీస్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి... లేకపోతే కంపెనీస్ కి చాలా మంది వస్తారు ... వచ్చినవాళ్లు అందరిని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, అసలు ఉద్యోగానికి అర్హత వున్నా వాళ్ళు చాలా తక్కువుగా వుంటారు సుమారు 30%. So 70 % అర్హతగా లేనివాళ్ళని గుర్తించటానికి సమయ భారము చాలా ఎక్కువుగా ఉంటుంది... అంటే తక్కువులో తక్కువ 10 మంది వచ్చారు అంటే వాళ్లలో ముగ్గురు అర్హతా కలిగినవాళ్లు ఏడుగురు అర్హత లేని వాళ్ళు.. ఒక్కళ్ళకి అర్ద గంట టైం తీసుకుంటే... మొత్తం 5 గంటలు అవుతుంది. అందులో మూడున్నర గంటలు వృధాగా అవుతుంది.
సమయము అంటే ఖర్చుతో కూడుకున్న పని అవటంవలన కంపెనీస్ Resume కోసం చూస్తారు...

రెస్యూమ్ లో వుండవలిసిన content ఏమిటో మనము చూద్దాము
ముందుగా మన బేసిక్ సమాచారం like పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి, Linkedin ప్రొఫైల్ (Optional ) మరియు లోకల్ అడ్రస్ .
కొన్ని ఉద్యోగాలలో like రిసెప్షనిస్ట్ లేక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కి మీ ఫోటో ఉంచితే మంచిది (Optional ).
తరువాత మీ objective లేక గోల్ 3 -4 లైన్స్ లో
తరువాత మీ అకాడమిక్ సమాచారం టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివరాలు.
తరువాత మీ experience సమాచారం కంపెనీ పేరు, రోల్, responsibilities , ప్రాజెక్ట్ వివరాలు .
మీరు fresher అయితే మీ గ్రాడ్యుయేషన్ లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ చేసిన ప్రాజెక్ట్ వివరాలు.
తరువాత మీ సర్టిఫికేషన్స్ , అవార్డ్స్ లేక గుర్తింపు పొందిన స్టేజి షోస్, వైట్ పేపర్స్ ప్రెసెంటేషన్స్  etc ...
తరువాత references సమాచారం ఉంటే మంచిది Min 2 .
పైన చెప్పినవి అన్ని ఒక ఆర్డర్ లో Resume లో పొందపరిస్తే మనకు ఇంటర్వ్యూ కాల్ రావటానికి అవకాశం ఉంటుంది.

రెస్యూమ్ ప్రొఫెషనల్ గా అంటే మంచి గా ఎందుకు ఉండాలి ?
ఎందుకంటే మన ఇంటర్వ్యూ కంటే ముందుగా కంపెనీస్ చూసేది మన రెస్యూమ్ నే. సో అందులో సరయిన సమాచారం పొందుపరచకపోతే ఆ Resume క్వాలిఫై అవదు ఇంటర్వ్యూ కి. సో Resume స్క్రీనింగ్ లో ఒకో ప్రొఫైల్ కి 2 మినిట్స్ కంటే టైం తక్కువ ఉంటుంది... సో ఈ 2 మినిట్స్ లోనే వాళ్ళని మనము ఇంప్రెస్స్ చేయాలి. అప్పుడు మీ ప్రొఫైల్ అనగా రెస్యూమ్ ఇంటర్వ్యూ రౌండ్ కి shortlist అవుతుంది.

రెస్యూమ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చా ?
ఒకటి కంటే ఎక్కువ ఉంటే నష్టం లేదు కదా... ఎందుకంటే... ఒక ప్రాజెక్ట్ లో ఒక సబ్జెక్టు మీద ఎక్కువ వర్క్ చేసి ఉంటాము... ఇంకో సబ్జెక్టు లో తక్కువ చేసి ఉంటాము... ఇప్పుడు మీరు తక్కువ చేసిన సబ్జెక్టు లో ఉద్యోగం కనపడి దానికి అప్లై చేయాలి అనుకున్నారు అనుకో... దానికి అనుగుణంగా రెస్యూమ్ ఉంటేనే గా అది shortlist అయి ఇంటర్వ్యూ కి పిలుస్తారు. సో ఒకటి కంటే ఎక్కువ రెస్యూమ్స్ ఉంటే నష్టం ఏమి లేదు. కానీ ఎన్ని రెస్యూమ్స్ వున్నా అందులో పొందుపరిచినా సమాచారం అంట కరెక్ట్ గానే ఉండాలి దానికి మనము కట్టుబడి ఉండాలి.

సో రెస్యూమ్ అది కొద ప్రొఫెషనల్ రెస్యూమ్ ఉద్యోగం కోసం చాలా అవసరం.

-Mike Sams.