No Copy

Wednesday, September 12, 2018

ఉద్యోగం కోసం ప్రొఫెషనల్ రెస్యూమ్ కావాలా ?

జాబ్ కోసం ప్రొఫెషనల్ resume కావాలా ?

మొదటిగా అసలు resume ఎందుకు కావాలి?
రెస్యూమ్ యొక్క అవసరము మనకి తెలియాలి అవునా కదా ?
రోజు మనము పేపర్లో , జాబ్ వెబ్ సైట్స్ లో , టీవిలో ఉద్యోగ ప్రకటనలు చాలా చూస్తూవుంటాము.
అందులో వున్నా అన్ని జాబ్స్ కి మనకు అర్హత ఉండదు , కొన్ని ఉంటాయి, కొన్ని వుండవు...
అర్హత వున్నా  లేకున్నా మనము అవసరము రీత్యా అప్లై చేస్తువుంటాము . మరి ఆ వైపు కంపెనీస్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి... లేకపోతే కంపెనీస్ కి చాలా మంది వస్తారు ... వచ్చినవాళ్లు అందరిని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, అసలు ఉద్యోగానికి అర్హత వున్నా వాళ్ళు చాలా తక్కువుగా వుంటారు సుమారు 30%. So 70 % అర్హతగా లేనివాళ్ళని గుర్తించటానికి సమయ భారము చాలా ఎక్కువుగా ఉంటుంది... అంటే తక్కువులో తక్కువ 10 మంది వచ్చారు అంటే వాళ్లలో ముగ్గురు అర్హతా కలిగినవాళ్లు ఏడుగురు అర్హత లేని వాళ్ళు.. ఒక్కళ్ళకి అర్ద గంట టైం తీసుకుంటే... మొత్తం 5 గంటలు అవుతుంది. అందులో మూడున్నర గంటలు వృధాగా అవుతుంది.
సమయము అంటే ఖర్చుతో కూడుకున్న పని అవటంవలన కంపెనీస్ Resume కోసం చూస్తారు...

రెస్యూమ్ లో వుండవలిసిన content ఏమిటో మనము చూద్దాము
ముందుగా మన బేసిక్ సమాచారం like పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి, Linkedin ప్రొఫైల్ (Optional ) మరియు లోకల్ అడ్రస్ .
కొన్ని ఉద్యోగాలలో like రిసెప్షనిస్ట్ లేక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కి మీ ఫోటో ఉంచితే మంచిది (Optional ).
తరువాత మీ objective లేక గోల్ 3 -4 లైన్స్ లో
తరువాత మీ అకాడమిక్ సమాచారం టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివరాలు.
తరువాత మీ experience సమాచారం కంపెనీ పేరు, రోల్, responsibilities , ప్రాజెక్ట్ వివరాలు .
మీరు fresher అయితే మీ గ్రాడ్యుయేషన్ లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ చేసిన ప్రాజెక్ట్ వివరాలు.
తరువాత మీ సర్టిఫికేషన్స్ , అవార్డ్స్ లేక గుర్తింపు పొందిన స్టేజి షోస్, వైట్ పేపర్స్ ప్రెసెంటేషన్స్  etc ...
తరువాత references సమాచారం ఉంటే మంచిది Min 2 .
పైన చెప్పినవి అన్ని ఒక ఆర్డర్ లో Resume లో పొందపరిస్తే మనకు ఇంటర్వ్యూ కాల్ రావటానికి అవకాశం ఉంటుంది.

రెస్యూమ్ ప్రొఫెషనల్ గా అంటే మంచి గా ఎందుకు ఉండాలి ?
ఎందుకంటే మన ఇంటర్వ్యూ కంటే ముందుగా కంపెనీస్ చూసేది మన రెస్యూమ్ నే. సో అందులో సరయిన సమాచారం పొందుపరచకపోతే ఆ Resume క్వాలిఫై అవదు ఇంటర్వ్యూ కి. సో Resume స్క్రీనింగ్ లో ఒకో ప్రొఫైల్ కి 2 మినిట్స్ కంటే టైం తక్కువ ఉంటుంది... సో ఈ 2 మినిట్స్ లోనే వాళ్ళని మనము ఇంప్రెస్స్ చేయాలి. అప్పుడు మీ ప్రొఫైల్ అనగా రెస్యూమ్ ఇంటర్వ్యూ రౌండ్ కి shortlist అవుతుంది.

రెస్యూమ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చా ?
ఒకటి కంటే ఎక్కువ ఉంటే నష్టం లేదు కదా... ఎందుకంటే... ఒక ప్రాజెక్ట్ లో ఒక సబ్జెక్టు మీద ఎక్కువ వర్క్ చేసి ఉంటాము... ఇంకో సబ్జెక్టు లో తక్కువ చేసి ఉంటాము... ఇప్పుడు మీరు తక్కువ చేసిన సబ్జెక్టు లో ఉద్యోగం కనపడి దానికి అప్లై చేయాలి అనుకున్నారు అనుకో... దానికి అనుగుణంగా రెస్యూమ్ ఉంటేనే గా అది shortlist అయి ఇంటర్వ్యూ కి పిలుస్తారు. సో ఒకటి కంటే ఎక్కువ రెస్యూమ్స్ ఉంటే నష్టం ఏమి లేదు. కానీ ఎన్ని రెస్యూమ్స్ వున్నా అందులో పొందుపరిచినా సమాచారం అంట కరెక్ట్ గానే ఉండాలి దానికి మనము కట్టుబడి ఉండాలి.

సో రెస్యూమ్ అది కొద ప్రొఫెషనల్ రెస్యూమ్ ఉద్యోగం కోసం చాలా అవసరం.

-Mike Sams.

No comments:

Post a Comment